Bhratha Maathaku Jejelu




Barata mataku jejelu  telugu 
Badi Panthulu

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు … విప్లవ వీరులు వీర మాతలు … ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

No comments:

Post a Comment